Apr 10,2023 22:24

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న సిఐటియు నాయకులు

స్కూల్‌ స్వీపర్ల బకాయిలు ఇవ్వాలి
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలలో స్కూల్‌ స్వీపర్స్‌గా పనులు చేస్తున్న వారికి 5 నెలల బకాయి జీతాలు ఇవ్వాలని సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో స్వీపర్లు ఆర్‌.డి.ఒ. వి.కె. శీనానాయక్‌ కివినతి పత్రం అందజేశారు. అనంతరం సిఐటియు పట్టణ కార్యదర్శి వై.కృష్ణమోహన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో నాడు-నేడు పనుల కింద శానిటైజేషన్‌ వర్కర్లుగా స్వీపర్లు పట్టణంలో పనులు చేస్తున్నారని తెలిపారు. వీరికి ఐదు నెలల నుండి జీతాలు ఇవ్వలేదన్నారు. జీతాలు రాకపోవడంతో వీరికుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు.
ప్రభుత్వం వీరి గోడు పట్టించుకోవట్లేదని ఇప్పటికైనా స్వీపర్లకు వెంటనే 5 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రతినెలా జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి.మధుసుధనరావు, స్వీపర్లు పద్మ, కామాక్షి, శోభ, తదితరులు పాల్గొన్నారు.