Dec 30,2022 20:21

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న రైతు సంఘాల నాయకులు

సకాలంలో యూరియా అందించాలి
- కౌలు, రైతు సంఘాల నాయకులు వినతి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : అవస్థలు పడుతున్న రైతులకు సకాలంలో యూరియా అందించి ఆదుకోవాలని ఆత్మకూరు కౌలురైతు, ఎపి రైతుసంఘం నాయకులు శుక్రవారం వ్యవసాయ అధికారి కిషోర్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రణాళిక లోపమో.. ముందస్తు చర్యలు కొరవడడమో.. కారణాలు ఏవైతే నేం.. ఎరువుల సక్రంగా అందగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మండలంలోని ఏడాది రబీ సాగులో విస్తీర్ణం 13వేల ఎకరాలు కాగా అందులో 7 వేల ఎకరాలు వరినాట్లు వేసినట్లు, మిగిలిన 6 వేల ఎకరాలకు రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
పట్టణంలో గ్రోమోర్‌ కేంద్రం వద్ద రైతులు ఎరువుల కోసం బారులు బారులు తీరి పడికాపులు కాస్తున్నారన్నారు. మండలంలో సుమారు 13వేల ఎకరాలు వరిపంట నాటి ఉన్నారని ఒక ఎకరాకి మూడు బస్తాలు చొప్పున 60 వేల బస్తాలు అవసరమై ఉందన్నారు. అయితే మార్కెట్‌ సరుకు దొరికే అవకాశం లేదని, పైగా యూరియాను ప్రయివేట్‌ కంపెనీలైన గ్రోమోర్‌ సిండికేట్‌ ఫార్మర్‌ సొసైటీలకు అనుమతులు ఇచ్చి రైతులకు తగినంత సప్లయి చేయలేక ఇబ్బంది పడుతూ రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. మండలంలో ఆర్‌బికెల ద్వారా రైతులకు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఇచ్చి రైతులను ఆదుకోవాల్సి ఉండగా.. ఉత్సవ విగ్రహాలు లాగా ఆర్‌బికె భవనాలు నిర్మించి ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకేమీ లేదని వ్యవసాయ శాఖ రైతులపై దయతలచి మార్క్‌ఫెడ్‌ వారితో సంప్రదించి ఆ ఎరువులు విత్తనాలు పురుగు మందులు ఆర్‌బికెలకు అనుసంధానం చేసి రైతుల సమస్యలను తీర్చాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు కౌలు రైతు సంఘం నాయకులు గంటా లక్ష్మీపతి, ఎపి వ్యవసాయ సంఘం ఆత్మకూరు అధ్యక్ష కార్యదర్శులు లక్కు కృష్ణ ప్రసాద్‌, కృష్ణమోహన్‌, రైతులు పాల్గొన్నారు.