Jan 06,2023 21:56

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

కదిరి అర్బన్‌ : వైద్యులు రోగులకు సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందించాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ పివి.సిద్ధారెడ్డి సూచించారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సమావేశ మందిరంలో హాస్పిటల్‌ డెవలప్మెంట్‌ సొసైటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిని రాష్ట్రంలోని ప్రథమ స్థాయిలో తీసుకొచ్చిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు ఆసుపత్రి సిబ్బందికి, శానిటరీ సిబ్బందిని అభినందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. ఆసుపత్రి నుండి రిఫరెన్స్‌ కేసులను సాధ్యమైనంత వరకు తగ్గించే విధంగా చూడాలన్నారు. రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని దానికి తగ్గట్టు వైద్యులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో గల ఆసుపత్రి భవనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హుస్సేన్‌, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్‌ ప్రసాద్‌, నాగమల్లు, నజీమున్నీసా, మధుసూదన్‌ రెడ్డి, ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.