సకాలంలో జీతాలు చెల్లించాలని రిలే దీక్ష
ప్రజాశక్తి-ఉదయగిరి : ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు సకాలంలో చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం మండల నాయకులు ఒక్కరోజు రిలే దీక్ష చేపట్టారు. మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం మండల నాయకులు చేపట్టి పలువురు నాయకులు మాట్లాడుతూ సి.పి.ఎస్.ను రద్దు పరచి ఒ.పి.ఎస్.ను పునరుద్ధరించాలన్నారు. ప్రతినెలా 1వ తేదీనే జీతభత్యాలు చెల్లించేలా చిట్టం చేసి 23-11-1993 కంటే ముందు నియమితులైన ఎస్.ఎమ్.ఆర్. వైలీవేజెస్ ఇంటిండెంట్ ఉద్యోగులను తక్షణమే కన్యులదైత్ చేయాలన్నారు. అన్ని శాఖలలో డి.ఎస్.సి. ద్వారా నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన జీతాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. 11వ పి.ఆర్.సి. అమలు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలలో భాగంగా ఆర్థికపరమైన బకాయిలను, డి.ఎ. అరియర్స్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 12వ వేతన సవరణ సంఘం నియమించకుండానే ఉద్యోగ సంఘాలతో నేరుగా సంప్రదింపులు జరిపి 12వ వేతన సవరణను ఉద్యోగులు దాచుకున్న సొమ్ము జి.ఎస్. ఎ.పి.జి.ఐ. భద్రత కల్పించాలన్నారు. పదవీ విరమణ గావించిన ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజునే అన్ని ఆర్థిక ప్రయోజనాలను విడుదలచేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశపరచి సమస్యలు చర్చించాలన్నారు. ఇంకా 200 డిమాండ్ల సాధనకై ఉద్యమ కార్యాచరణ ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ జావీద్, తాలూకా ప్రెసిడెంట్ కొండారెడ్డి, ట్రెజరర్ వెంకటసుబ్బయ్య, సెక్రటరీ సర్దార్ అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.










