Oct 30,2023 00:11

శివయ్య కొందరి వాడేనా? కొందరికే గ్రహణ పూజలు

శివయ్య కొందరి వాడేనా?
కొందరికే గ్రహణ పూజలు
ప్రజాశక్తి- శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారుల తీరు నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఎన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నా వారిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. తాము చెప్పిందే శాసనం, చేసింది కరెక్టు అనే విధంగా ఉంటున్నారు. శనివారం అర్థరాత్రి ఆలయంలో చంద్ర గ్రహణం సందర్భంగా మూడుసార్లు ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయని ఈవో సాగర్‌ బాబు ముందుగా ప్రకటించారు. అయితే భక్తులను అనుమతిస్తారా లేదా అనే విషయాన్ని ఆయన తెలపలేదు. అయితే సుమారు వెయ్యి మందికి పైగా భక్తులు అభిషేక సేవలో పాల్గొన్నట్లు సమాచారం. ధర్మకర్తల మండలికి చెందిన కొందరు సభ్యులు, దేవస్థానం అధికారులు కొందరు తమకు సంబంధించిన వారిని అభిషేకాలకు ఆహ్వానించినట్లు తెలిసింది. ప్రత్యేక అభిషేకాలకు భక్తులను అనుమతించేదీ, లేనిది దేవస్థానం అధికారులు ఎందుకు బహిరంగంగా ప్రకటించలేదో వారికే తెలియాలి. అధికారులు ముందుగా ప్రకటించి ఉంటే స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల భక్తులు కూడా అభిషేకాలకు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఉండేవారు. శివయ్య అందరివాడు కాదు కొందరి వాడే అని అధికారులే నిర్ణయం