మాట్లాడుతున్న కమిషనర్ హరిత
'సిటిజెన్ ఔట్ రీచ్' తో అవగాహన పెంచండి
నెల్లూరు:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పధకాలపై ప్రజలకు అవగాహన పెంచేందుకు రూపొందించిన 'సిటిజెన్ ఔట్ రీచ్' కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని వలంటీర్లు, వార్డు సచివాలయ కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు. ప్రతీనెలా చివరి శుక్రవారం, శనివారం సచివాలయ పరిధిలోని అన్ని కుటుంబాలను దర్శించి ప్రభుత్వ పధకాలను వివరించాలని, అర్హులైన వారికి పధకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఆశయాలతో నిర్వహిస్తున్న స్పందన వేదికలో అందే ఫిర్యాదుల పరిష్కారంలో నగర పాలక సంస్థ అన్ని విభాగాల సిబ్బంది నిబద్ధత పాటించాలని, నిర్దేశించిన గడువులోపు సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించాలని కమిషనర్ హరిత అధికారులకు సూచించారు. కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన వేదికలో ఫిర్యాదుదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రతీ విభాగం ఉన్నతాధికారి తమకు సంభందించిన ఫైళ్లు పెండింగులో లేకుండా జాగ్రత్తలు వహించాలని, సూచించిన గడువులోపు సమస్యలు పరిష్కారం కావాలని స్పష్టం చేసారు. డయల్ యువర్ కమిషనర్ ద్వారా 21 సమస్యలు, స్పందన వేదికలో 28 విజ్ఞప్తులను అందుకున్నామని, గడువులోపు పరిష్కరించేందుకు కషి చేస్తామని తెలిపారు.స్పందన వేదికలో మేనేజర్ ఇనాయతుల్లా, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ సంపత్ కుమార్, సెక్రటరీ హేమావతి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










