ఫొటో : శంకుస్థాపన చేస్తున్న వైసిపి నాయకులు
సిసిరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
ప్రజాశక్తి-ఆత్మకూర్ అర్బన్ : మండలంలోని నలపరెడ్డిపల్లి ఎస్‌సి కాలనీలో సిసిరోడ్డు ఆత్మకూరు నియోజకవర్గం వైసిపి ఎస్‌సిసెల్ కన్వీనర్ ఎర్రగుంట పెంచలయ్య ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌సిసెల్ కన్వీనర్ ఎర్రగుంట పెంచలయ్య మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి ఎస్‌సి ఎస్‌టి కాలనీల అభివృద్ధికి నోచుకోక దగాకు గురవుతున్న తరుణంలో మన జగనన్న ప్రభుత్వంలో ఈ పనులు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో బట్టేపాడు వైసిపి నాయకులు బొమ్మిరెడ్డి రవికుమార్‌రెడ్డి, తోటపల్లి రవికుమార్ రెడ్డి, వార్డు మెంబర్లు పెండం పెంచలమ్మ, ఉదయగిరి పెంచలయ్య, వాలంటీర్లు గృహసారథి వై.అనూష, ముంతా బాలకృష్ణ, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.










