Mar 16,2023 22:17

ప్రతిజ్ఞ చేస్తున్న నాయకులు

పుట్టపర్తి అర్బన్‌ : ఎన్నికల సందర్భంగా జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్‌ ను రద్దుచేసి ఒపిఎస్‌ను పునరుద్దించాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జయచంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం పట్టణం లోని సాయిబృందావన్‌ హోటల్‌లో యుటిఎఫ్‌ పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌ డిఎలను ఇవ్వాలని ఆర్జిత సెలవులను మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఆయా మండలాలకు నూతన కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పరిశీలకులుగా కోనంకి చంద్రశేఖర్‌, భాస్కర్‌ వ్యవహరించారు.
నూతన కార్యవర్గాల ఏర్పాటు
పుట్టపర్తి మండల గౌరవ అధ్యక్షులుగా లక్ష్మీ నరసప్ప, అధ్యక్షులుగా రవీంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సంపత్‌ కుమార్‌, కోశాధికారిగా నాగరాజు, ఉపాధ్యక్షులుగా లక్ష్మీనారాయణ, కొత్తచెరువు మండల గౌరవ అధ్యక్షులుగా హెచ్‌ భాస్కర్‌, అధ్యక్షులుగా పవన్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా శివయ్య, ఉపాధ్యక్షులుగా అప్పులప్ప, బుక్కపట్నం మండల గౌరవ అధ్యక్షులుగా రామాంజనేయులు, అధ్యక్షులుగా శివశంకర్‌, ప్రధాన కార్యదర్శిగా వెంగమనాయుడు, ఉపాధ్యక్షులుగా సుధాకర్‌, మంజుల తదితరులను ఎన్నుకున్నారు.
గాండ్లపెంట : యుటిఎఫ్‌ మండల నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి చెన్నూర్‌ తాహెర్‌ వలి తెలిపారు. ఎన్నికల పరిశీలకుడు డి శ్రీనివాసులు వ్యవహరించారన్నారు. యుటిఎఫ్‌ మండల గౌరవ అధ్యక్షులుగా వైవి సుబ్బారెడ్డి, అధ్యక్షులుగా ఖాదర్‌బాషా, ఉపాధ్యక్షులుగా లక్ష్మీప్రసాద్‌, రజినితో పాటు మరికొంతమందిని కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రామసుబ్బయ్య, నాగరాజు, రాజశేఖర్‌, అరుణ, శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు
నల్లచెరువు : మండల కేంద్రంలో గురువారం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ మండల శాఖ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి చెన్నూర్‌ తాహెర్‌ వలి హాజరయ్యారు. ఈసందర్భంగా మండల కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ఆనంద్‌, అధ్యక్షులుగా నజీర్‌బాషా, సహాధ్యక్షులుగా మహబూబ్‌ బాషా, సుగుణ, ప్రధాన కార్యదర్శిగా రవి వర్ధన్‌ రెడ్డి, కోశాధికారిగా రమేష్‌ బాబు, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా ఆజంబాషా, కార్యదర్శులుగా వేణుగోపాల్‌ రావు, గంగయ్య, యుగంధర్‌ రెడ్డి, ఇర్ఫాన్‌బాషా, దాదాపీర్‌, ప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కదిరి టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సిపిఎస్‌ రద్దు చేస్తూ తీర్మానం చేయాలని యుటిఎఫ్‌ నాయకులు శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. జిల్లా లోని కదిరి గ్రామీణ మరియు కదిరి పట్టణ యుటిఎఫ్‌ నూతన శాఖలను గురువారంఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి చెన్నూర్‌ తాహెర్‌ వలి హాజరై ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఎన్నికల పరిశీలకులుగా జిల్లా కార్యదర్శి డి. శ్రీనివాసులు వ్యవహరించారు. కదిరి గ్రామీణ మండల గౌరవ అధ్యక్షులుగా మహమ్మద్‌ హనీఫ్‌, అధ్యక్షులుగా నాగరాజు, సహాధ్యక్షులుగా వింధ్యారాణి, మాహినూర్‌, ప్రధాన కార్యదర్శిగా మనోహర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కదిరి పట్టణ శాఖ శాఖ గౌరవ అధ్యక్షులుగా బి మొయినుద్దీన్‌, అధ్యక్షులుగా సి మధుసూదన్‌, సహాధ్యక్షులుగా డి క్రిష్టప్ప, గౌసియా, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ భార్గవ్‌ను ఎన్నుకున్నారు.