Apr 23,2023 21:54

సిపిఎస్‌ను రద్దు చేయాలి

 రాయచోటి : రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్‌ను వెంటనే రద్దు చేసి పెండింగ్‌లో ఉన్న డిఎలను విడుదల చేయాలని ఎపిజిఇఎ జిల్లా ఎర్రపు రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కోశాధికారి సుధాకర్‌ రాజు పేర్కొన్నారు .ఆదివారం మదనపల్లి రోడ్డులోని జిల్లా కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్ర ప్రతినెలా ఒకటి తేదీనే వేతనాలు అందించాలన్కానరు. ఉపాధ్యాయుల ఏకీకత సర్వీస్‌ , రూల్స్‌ న్యాయపరమైన ఇబ్బందులను తొలగించడానికి కషి చేయాలన్నారు . కార్యదర్సులు గ్రేడ్లు 6 స్థానంలో, 2 లేక మూడుకు కుదించి , పెన్షనర్ల, కంటింజెంట్‌, కాంట్రాక్టు, ఆర్‌టిసి, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆరోగ్య శాఖ ఉద్యోగులపై అదనపు భారం తగ్గించాలని, ఫేషియల్‌ యాప్‌ రద్దు చయాలని చెప్పారు. సమస్యలు పరిష్కరించాలని అనేక పర్యాయాలు విన్న వించినా సరైన స్పందన లేకపోవడం వల్ల ఈ నెల 30న రాజమ హేంద్రవరంలో ఎపిజిఇఎ రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎం. రెడ్డి నాయక్‌, ప్రవీణ్‌ కుమార్‌ రాజు, జాయింట్‌ సెక్రటరీ శ్రీనివాసులు , రాయచోటి తాలూకా అధ్యక్షులు ఓ. సాయి కుమార్‌, కార్యదర్శి సుజిత్‌, లక్కిరెడ్డిపల్లి తాలూకా అధ్యక్షులు తిమ్మారెడ్డి, కార్యదర్శి దేవేంద్ర రెడ్డి, మదనపల్లి తాలూకా అధ్యక్షులు నాగేంద్ర బాబు, ఐఎన్‌టియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు నాయక్‌, క్రిష్ణయ్య, పెన్షనర్స్‌ జిల్లా అధ్యక్షులు పి. రాజా, హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ డైరెక్టర్‌ ఎం. సిద్దయ్య నాయుడు పాల్గొన్నారు.సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు