సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి
ప్రజాశక్తి-వరికుంటపాడు : సిపిఎస్ రద్దు చేయాలని, పిఆర్‌సి, డిఎ బకాయిలను వెంటనే విడుదల చేయాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డి శివప్రసాద్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని యుటిఎఫ్ మండల విస్తృతస్థాయి సమావేశం నిరంహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడలని పిలుపునిచ్చారు. జీతాలు ఒకటవ తేదీన ఇవ్వాలని డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చామని సమస్యలను పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. 3 4 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేసి విద్యా వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులైన పి.బాబు రెడ్డి, మీగడ వెంకటేశ్వర్ రెడ్డిని గెలిపించి, యుటిఎఫ్ సత్తా ఏమిటో ప్రభుత్వానికి చూపాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రతినిధి ఆర్.నాగార్జున, సీనియర్ నాయకులు మేడసాని సుబ్బారావు, హరిచంద్ర ప్రసాద్, ఎల్‌వి నారాయణ, డి.వెంకటేశ్వర్లు, కే వెంకటేశ్వర్లు, వి.వెంకటసుబ్బయ్య, వి.సుబ్రహ్మణ్యం, ఎల్‌వి రమణ, తదితరులు పాల్గొన్నారు.










