Sep 24,2023 22:00

ఫొటో : మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అజరు కుమార్‌

సిపిఎం పాదయాత్ర విజయవంతానికి పిలుపు
ప్రజాశక్తి-ఉదయగిరి : జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ చేపట్టే పాదయాత్రను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అజరు కుమార్‌ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లా ఉదయగిరి మెట్ట ప్రాంత అభివృద్ధి కోసం అక్టోబర్‌ 2 గాంధీ జయంతి నుండి 13వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే ఈ సిపిఎం పాదయాత్ర 3 దళాలుగా ప్రారంభమై జిల్లాకు చేరుతాయన్నారు. రామాయపట్నం నుండి ఒకదళం, సీతారామపురం మండలం బసినాపల్లి నుండి మరొక దళం, రాపూర్‌ నుండి ఇంకో దళంతో పాదయాత్ర మూడు ప్రాంతాల నుండి ఈ పాదయాత్రలో చేపడతామన్నారు. జిల్లాల విభజన తర్వాత నెల్లూరు జిల్లాకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జిల్లాలో 38 మండలాల్లో చెప్పుకోదగ్గ ఫ్యాక్టరీ ఒకటి లేదని గుర్తు చేశారు.
ఈ నాలుగేళ్ల జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ వలసల నివారణకు అభివృద్ధిని మరిచి ఒక్క ఫ్యాక్టరీ నిర్మించలేదని దుయ్యపట్టారు. ప్రస్తుత శాసనసభలో జిల్లా అభివృద్ధి కోసం ఏ ఒక్కరూ మాట ఇవ్వడం లేదని ఈ పాదయాత్రతోనైనా సమస్యలపై గళం విప్పుతారని సిపిఎం తరఫున అన్ని ప్రాంతాలవారీగా అభివృద్ధి ఈ పాదయాత్ర చేపడుతున్నామన్నారు. ఉదయగిరి వేనుకబడిన 8 మెట్ట మండలాలలో నిరుద్యోగ నిర్మూలన వలసలు అరికట్టేందుకు ఒక ఫ్యాక్టరీ నిర్మించాలని, ఇప్పటికి స్థితి గతి లేని సీతారాం సాగర్‌ నిర్మాణం పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌ పనులను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో రామాయపట్నం పోర్టును పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నిర్మించాలని, నెల్లూరు ప్రజా వైద్యశాలను నర్సింగ్‌ కాలేజీ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసి వంద పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయాలన్నారు. అనేక స్థానిక సంస్థలపై అక్టోబర్‌ 3న బసినపల్లి నుండి ప్రారంభమయ్యే సిపిఎం పాదయాత్రను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఫర్ధీన్‌ భాషా, ఎంపిటిసి కాకు విజయ, రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య, కె ఎన్‌ పిఎస్‌ నాయకులు సింహాద్రి, దుత్తలూరు సిపిఎం మండల కార్యదర్శి గుజ్జుల మల్లికార్జున, సీతారాంపురం సిపిఎం మండల కార్యదర్శి కోడె రమణయ్య, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.