కన్నూర్ : సిపిఎం మహాసభల ప్రతినిధులుగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 812 మంది పాల్గొంటున్నారు. మంగళవారం సాయంత్రానికి వారంతా కన్నూర్ చేరుకున్నారు. ఇందులో 17 మంది పొలిట్‌బ్యూరో సభ్యులు, 78 మంది కేంద్ర కమిటీ సభ్యులు, 640 మంది ప్రతినిధులు, 77 మంది పరిశీలకులు సహా 812 మంది ఉన్నారు. అత్యధికంగా కేరళ నుంచి 178, పశ్చిమ బెంగాల్ నుంచి 163 మంది, త్రిపుర నుంచి 42 మంది ప్రతినిధులు హాజరయ్యారు. గోవా, అండమాన్ నుంచి ఒక్కొక్కరు హాజరయ్యారు. గత నాలుగేళ్ల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజాశ్రేయస్సు కోసం సిపిఎం అనేక పోరాటాలు నిర్వహించింది. ఆ పోరాటాలను, ఉద్యమాలను ఈ సభల్లో సమీక్షించనున్నారు.










