Mar 01,2023 21:44

ఫొటో : వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిపిఐ నాయకులు

సిపిఐ పోరుబాట జయప్రదానికి పిలుపు
ప్రజాశక్తి ఇందుకూరుపేట : సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే సిపిఐ పోరుబాట మహా ధర్నా కార్యక్రమాన్ని జగనన్న ఇళ్లు, టిడ్కో ఇళ్లు లబ్ధిదారులు హాజరై జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర రైతు విభాగం నాయకులు ఎస్‌.కె.షాన్‌వాజ్‌ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని ఇందుకూరుపేటలో సిపిఐ పోరుబాట వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోగా ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు.
ప్రజలందరికీ సమానంగా ఇళ్లు కట్టించి ఇస్తానన్న జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను మర్చిపోయారన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని జగనన్న ఇళ్లకు ఐదు లక్షల ఇవ్వాలని, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు తక్షణ స్వాధీనం చేయాలని డిమాండ్‌ చేశారు. లబ్ధిదారులందరూ సిపిఐ మహా ధర్నాకు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎఐవైఎఫ్‌ నెల్లూరు జిల్లా కన్వీనర్‌ షేక్‌ మున్నా, ఎన్‌.మధు, నెల్లూరు రమణయ్య, వీరయ్య, ఎస్‌ డి గౌస్‌ బాషా, కొముదుల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.