ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : మండలంలోని పేడూరులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. శనివారం ఆయన పేడూరు పంచాయతీ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు, గ్రామస్తులు మంత్రి గోవర్ధన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పేడూరు గ్రామ సచివాలయ పరిధిలో మంత్రి కాకాణి రూ. 29.30 లక్షలతో చేపట్టిన అంతర్గత సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. పేడూరు గ్రామంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పురస్కరించుకొని గోవర్ధన్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజలను వారి సమస్యలు తెలుసుకుంటూ, వారు పొందిన సంక్షేమ లబ్దిని తెలిపే బుక్లెట్ ను అందించారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్ రెడ్డి, కన్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్, ఎంపీపీ స్వర్ణలత, తలమంచి సురేంద్ర బాబు, ఉదరు భాస్కర్ రెడ్డి, జెడ్పిటిసి శేషమ్మ, మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










