Jun 20,2022 23:25

సిలార్‌ను సన్మానిస్తున్న రెడ్‌ క్రాస్‌ సభ్యులు

ప్రజాశక్తి-మచిలీపట్నం అర్బన్‌: డాక్టర్‌ పట్టాభి రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్‌గా సిలార్‌ అందించిన సేవలు ప్రసంశనీయమని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కృష్ణా జిల్లా చైర్మన్‌ టి.ఎస్‌.ఎస్‌ బాలాజీ అన్నారు. సీలార్‌ పదవీ విరమణ సభ సోమవారం సమావేశ మందిరంలో నిర్వహించారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సెక్రటరీగా, డా. పట్టాభి రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్‌గా దీర్ఘకాలంగా సేవలందించిన మొహమ్మద్‌ సిలార్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసినా అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. కోవిద్‌ సమయంలో శ్రీ సిలార్‌ చేసిన సేవలను అభినందించారు. జిల్లా ఉపాధ్యక్షులు వంగర శేషగిరరావు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో కార్యాలయం ప్రారంభం కాకముందే శ్రీ సిలార్‌ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తాననటం కొంత ఇబ్బంది కలిగిందన్నారు. ఆయన లౌక్యంగా సమాజ సేవలో పాల్గొన్న తీరు ప్రశంసనీయం అన్నారు. కృష్ణా యునివర్సిటీ రెక్టర్‌ డాక్టర్‌ డి.సూర్యచంద్రరావు మాట్లాడుతూ ల్యాండ్‌ అక్విషన్‌ సమస్యలు వచ్చినప్పుడు శ్రీ సిలార్‌ వద్ద సలహాలు, సూచనలు తీసుకోవటం జరిగిందని, ఆయన రాసిన తరతరాల బందరు చరిత్ర పుస్తకం లైబ్రరీలో రిఫరెన్‌కు ఉందని అన్నారు. ఆయన ఒక హిస్టోరియన్‌ మాత్రమే కాక సేవా కార్యక్రమాలలో పాల్గొంతుండటం సంతోషకరం అన్నారు. మరిన్ని పుస్తకాలు రచనలు కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసి ఎఓ వి.సత్యనారాయణ, జిల్లా బ్రాంచ్‌ సభ్యులు, బ్లడ్‌ బ్యాంకు డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.