Dec 11,2022 22:20

లబ్ధిదారులతో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

ప్రజాశక్తి ,కదిరి టౌన్‌ : కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా బాధితులకు మంజూరైన సిఎం సహాయనిధి చెక్కులను స్థానిక ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి లబ్ధిదారులకు ఆదివారం పంపిణీ చేశారు. పలువురికి మంజూరైన రూ.14.20 లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వర్తించనివివిధ జబ్బులతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న 9 మంది లబ్ధిదారులకు రూ. 14.20 లక్షల రూపాయల చెక్కులను అందజేసినట్లు చెప్పారు. ఈసందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నజీమున్నీసాసాదిక్‌, జెడ్పీటీసీ విశ్వనాథ్‌ రెడ్డి, కౌన్సిలర్‌ షాను, సర్పంచులు కుర్లి శివారెడ్డి, సెమీవుల్లా, ఎంపీటీసీ హేమశేఖర్‌ రెడ్డి, ఎస్సీ సెల్‌ కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.