May 05,2022 13:09

ప్రజాశక్తి-నందిగామ : నందిగామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  కార్యాలయం నందు 37 మంది లబ్ధిదారులకు 22 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ మాట్లాడుతూ ఇప్పటివరకు నందిగామ నియోజకవర్గానికి ఏడు విడతలుగా 500 మంది లబ్ధిదారులకు 1కోటి 80 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకానికి పునర్జీవం తీసుకువచ్చారని,  దాదాపు 2400 రోగాలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా  వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీలో వైద్యసేవలు అందించే రోగాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అందదని, ప్రజలందరూ గమనించి  ఎక్కడైతే ఆరోగ్యశ్రీ పధకం అందుతుందో ఆ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలని ఆయన కోరారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్లు నెలకుదిటి శివ నాగేశ్వరరావు,యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్, కోటేరు ముత్తారెడ్డి , ఆవుల రమేష్, బొల్లి
నేని శ్రీనివాసరావు, ఎంపిపి అరిగెల సుందరమ్మ , ఐతవరం సర్పంచ్ నాయుడు ఉదయలక్ష్మి ,నాదెండ్ల నరేంద్ర, నందిగామ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడివాడ సాంబశివరావు, కర్రి రవీంద్ర, గ్రామ సర్పంచులు,లబ్ది దారులు పాల్గొన్నారు.