Apr 08,2023 21:06

అంబేద్కర్‌ సర్కిల్‌లో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలుపుతున్న ఎపి జెఎసి ఉద్యోగులు

        ప్రజాశక్తి-హిందూపురం   'సిఎం సారూ.. సంక్షేమ పథకాలకే కాదు.. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు కూడా బటన్‌లు నొక్కితే బాంటుంది సారూ..' అంటూ జిల్లా ఎపి జెఎసి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మైనుద్దీన్‌ సూచించారు. ఎపి జెఎసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద వాల్‌పోస్టర్లను అతికించారు. అనంతరం మైనుద్దీన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యం ఏ ప్రభుత్వం వ్యవహరించలేదన్నారు. ఆఖరికి ఉద్యోగులు ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నారాయణస్వామి, జీలన్‌, మల్లికార్జున, ఇర్షాద్‌, నరసింహులు, జమ్మన్న, పెద్ద ఎత్తున ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు.