May 10,2023 21:06

ఫొటో : ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

సిఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
ప్రజాశక్తి-కావలి : కావలిలో 12 ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి పర్యటన సందర్భంగా బహిరంగ సభకు వచ్చే లబ్ధిదారులకు, సబికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ తెలిపారు. బుధవారం సభా వేదిక వద్ద గ్యాలరీ ఇన్‌ఛార్జి అధికారులతో సమీక్ష చేశారు. వేలాదిమంది ప్రజలు ముఖ్యమంత్రి సభకు వస్తున్నందున 40 గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో గ్యాలరీకి ఒక మండల స్థాయి అధికారితో పాటు పదిమంది సిబ్బందిని నియమించామన్నారు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన వారందరికీ తాగునీరు, స్నాక్స్‌ అందించి, కావాల్సిన సౌకర్యాలు కల్పించడం తదితర అంశాలపై దిశా నిర్థేశం చేశారు. గ్యాలరీకి ఓవరాల్‌ ఇన్‌ఛార్జులుగా జిల్లా పరిషత్‌ సిఇఒ చిరంజీవి, పిడి డిడబ్ల్యూఎం ఎ వెంకటరావును నియమించామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ రోణంకి కూర్మనాధ్‌, జెడ్‌పి సిఇఒ, పిడి డిడబ్ల్యుఎంఎ తదితర అధికారులు పాల్గొన్నారు.