Jan 06,2023 22:00

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ శ్రీనివాసులు

సిబ్బంది బాధ్యతగా పనిచేయాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు బాధ్యతగా పనిచేసే విధంగా పంచాయతీ కార్యదర్శులు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒ సి.శ్రీనివాసులు తెలియజేశారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు బాధ్యతగా పనిచేయటం లేదని పలు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కావున వారి పనితీరును సమగ్రంగా పరిశీలించాలన్నారు. అలాగే సచివాలయం పనివేలలు తప్పని సరిగా పాటించాలని, కార్యాలయంలో అన్ని రికార్డులు సక్రమంగా నిర్వహించాలని జిల్లా అధికారులు తనిఖీకి వచ్చినపుడు ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని తెలిపారు.
సురక్షిత మంచినీటి సరఫరా గ్రామ ప్రజలకు అందించాలని, దోమల నివారణకు ప్రత్యేక పారిశుధ్య పనులు తరచూ చేపట్టాలని ఆయన కోరారు. ఆత్మకూరు మండలంలోని కరటంపాడు షేడ్‌ను మోడల్‌ ట్రైనింగు సెంటర్‌గా ఎంపికైందని, కావున ఈ షేడ్‌కు కావలసిన వసతుల ఏర్పాటుకు రూ.2 లక్షలు మండల అధ్యక్షులు కేటాయింపు చేశారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని మండలానికి మంచి గుర్తింపును తీసుకొని రావాలని కోరారు. సమావేశంలో విస్తరణ అధికారి టి.ఉషారాణి అందరూ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.