Jan 07,2023 19:27

టెక్నీషియన్ల నూతన కమిటీతో సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ : పట్టణంలోని పలురకాల ల్యాబ్‌ టెక్నీషియన్లు సిఐటియు అనుబంధ ఎపి పారామెడికల్‌ అసోసియేషన్‌లో చేరారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు పేర్కొన్నారు. శనవారం స్థానిక ఎన్‌జిఒ హోమ్‌లో పారామెడికల్‌ అసోషియేషన్‌ సమావేశం జిల్లా అనిల్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య ఆహ్వానితులుగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ ల్యాబ్‌ టెక్నీషియన్లలో శారీరక, మానసిక శ్రమ తీవ్రమైందన్నారు. పనిముగించుకుని వెళ్లే రాత్రిపూట పోలీస్‌ ఇతర సమస్యలు ఎదురయ్యే క్రమంలో వారికి గుర్తింపుకార్డులు, సామాజిక భద్రత కల్పించే బాధ్యత యాజమాన్యాలదేనని తెలిపారు. డ్రస్‌ కోడ్‌ అమలు చేయాలని, ఇచ్చే జీతం ప్రతి నెలా ఐదవ తేదీలోగా ఇవ్వాలన్నారు. వారాంతపు సెలవులిచ్చి అకౌంట్‌ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. ఇఎస్‌ఐ, పిఎఫ్‌తోపాటు ఎనిమిది గంటల పని అమలు చేసి పండగల బోనస్‌ ఇవ్వాలన్నారు. ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్స్‌ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. స్టాఫ్‌ నర్స్‌, లేడీ స్టాఫ్‌కు రెస్ట్‌ రూమ్‌ ఇవ్వాలని సూచన చేశారు. సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌.ఓబులమ్మ, కార్యదర్శి డి.భాగ్యలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌.ఫయాజ్‌, ల్యాబ్‌, ఇసిజి, ఎక్స్‌రే, స్కానింగ్‌, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌లతో కూడిన కన్వీనింగ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా కన్వీనర్‌గా జె.అనిల్‌ కుమార్‌, కో-కన్వీనర్‌గా కె.రవీంద్ర, కమిటీ సభ్యులుగా జె.నాగరాజ, బాలాజి, సాయికుమార్‌రెడ్డి, కెవి.రమణ, వీరయ్య, మహమ్మద్‌ రఫి, గణేష్‌, మధు, సాహేబ్‌, అక్బన్‌, ఫ్రిజ్‌, మస్తాన్‌, జాఫర్‌, శ్రీనివాసులు, రెడ్డికుమార్‌లతో పాటు పలువురు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.