ఫొటో : జెండా ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు
సిఐటియు జెండా ఆవిష్కరణ
ప్రజాశక్తి-ఉదయగిరి : సిఐటియు ఆల్ ఇండియా 17వ మహాసభను జయప్రదం చేయడానికి పుచ్చలపల్లి సుందరయ్య భవనం ఆవరణంలో మంగళవారం జిల్లా నాయకులు గడ్డం నాగేశ్వరరావు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతు సంఘం సిఐటియు నాయకులు మాట్లాడుతూ 18 నుండి 22వ తేదీ వరకు బెంగళూరులో జరిగే ఆల్ ఇండియా సిఐటియు మహాసభను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. వైసిపి ప్రభుత్వం తెచ్చిన చీకటి జిఒ నెంబర్ ఒకటిని రద్దుచేసి సభలు సమావేశాలు ర్యాలీలు యథావిధి జరిగేలా ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. న్యాయమైన కోర్కెలపై చేపట్టే నాయకులపై అక్రమ అరెస్టులు నిర్బంధాలు చేపట్టడం దుర్మార్గమైన చర్యని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సిఐటియు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.










