Jan 10,2023 18:47

సిఐటియు జెండా ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి -ఉలవపాడు :సిఐటియు అఖిలభారత మహాసభలు ఈనెల 18 నుంచి 22 వరకు బెంగళూరులో జరుగుతున్న జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఉలవపాడులో ఆటోస్టాండ్‌ వద్ద సిఐటియు జెండా ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జివిబి కుమార్‌ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించేందుకు నాలుగు లేబర్‌ కోడ్‌ లను తీసు కొచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శనలు, ర్యాలీలు రోడ్‌ షో లను నిషేధిస్తూ జిఒ నెంబర్‌ 1 తేవడం దుర్మార్గమన్నారు. సిఐటియు, ఉలవపాడు మండల కార్యదర్శి ఎస్‌.డి. గౌస్‌ బాషా, ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూని యన్‌(సిఐటియు) ఉలవపాడు ప్రాజెక్టు కమిటీ అధ్యక్షురాలు సి.హెచ్‌ ఇందిరావతి ,ఉలవపాడు మండల ఆటో వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.డి జహీర్‌, డి కోటేశ్వరరావు నాయకులు సుల్తాన్‌, ఉలవపాడు మండల ముఠా వర్కర్‌ యూనియన్‌ నాయకులు చింతల రవి సిహెచ్‌ ముసలయ్య దామతోటి వేణు, పంచాయతీ వర్కర్స్‌ యూని యన్‌ నాయకులు ఏ విజరు బాబు అంగన్వాడీలు ప్రవీణ,గీత, ఏ.పీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు డిఎం రాయుడు, సిహెచ్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.