సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీల ధర్నా
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేల ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యువిటీ ఇవ్వాలని, ఫేస్ యాప్ రద్దు చేయాలని కోరుతూ మండలంలోని సిడిపిఒ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ వర్కర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టిపి గూడూరు మండల కార్యదర్శి మస్తానమ్మ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్, ఇందుకూరుపేట, టిపి గూడూరు మండలాల అంగన్‌వాడీ వర్కర్లు కొన్ని డిమాండ్‌తో అంగన్‌వాడీ వర్కర్లు పెద్ద ఎత్తున నినాదాలతో ఐసిడిఎస్ కార్యాలయాన్ని హోరెత్తించారు. అనంతరం సిడిపిఒ హేనసుజన్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మారుబోయిన రాజా మాట్లాడుతూ అంగన్‌వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షల ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని, అంగన్‌వాడీలకు జాబ్ క్యాలెండర్ నిర్ణయించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని, సర్వీస్‌లో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, బీమా అమలు చేయాలని ప్రభుత్వాలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇందుకూరుపేట సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, అంగన్వాడి అధ్యక్ష, కార్యదర్శులు శారద, స్వర్ణలత, సుగుణ, నెల్లూరు రూరల్ సౌత్‌మోపూర్ వర్కర్లు శ్రీదేవి, పద్మ, నాగభూషణమ్మ, నారాయణరెడ్డిపేట అంగన్‌వాడీ వర్కర్లు ఉమా, సుభాషిణి, నీరజ, అల్లీపురం వర్కర్లు, టిపి గూడూరు వర్కర్స్ టి.భాగ్యలక్ష్మి, అంబాపురం వర్కర్లు రత్నమ్మ, చారమ్మ, సిఐటియు నాయకులు నాగేశ్వరరావు, లీగల్ అడ్వైజర్ శ్యామ్‌రెడ్డి, గంగపట్నం ఆటో స్టాండ్ కార్యదర్శి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.










