ఫొటో : నివాళులర్పిస్తున్న నెల్లూరు జెడ్‌పి సభ్యులు కోఆప్టెడ్ షేక్ గాజుల తాజుద్దీన్
సిఐ మృతికి తాజుద్దీన్ సంతాపం
ప్రజాశక్తి-ఉదయగిరి : సిఐ నాగేశ్వరరావు మృతికి నెల్లూరు జెడ్‌పి సభ్యులు కోఆప్టెడ్ షేక్ గాజుల తాజుద్దీన్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు సిఐ నాగేశ్వరరావు హఠాత్తుగా హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందడం బాధాకరమని తెలిపారు. ఆత్మకూరులో సిఐ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మంచి వ్యక్తి, మంచి మానవ సంబంధాలు కలిగిన నాగేశ్వరరావు మృతి తీరని లోటని, మంచి అధికారి అతి చిన్న వయస్సులోనే మరణించడం బాధాకరమని తెలిపారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.










