కడప ప్రతినిధి : జిల్లాలో ఎన్నికల ప్రచార ఘట్టం ముగియడంతో గప్‌చుప్ వాతా వరణం నెలకొంది. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ పరిధిలో శనివారం సాయ ంత్రం నుంచి బహిరంగ రాజకీయ, ప్రచార, సోషల్ మీడియా ప్రచారం వంటి కార్యకలాపాలకు ఎన్నికల కమిషన్ అడ్డుకట్ట పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగిన సుమారు 51 మంది పట్టభద్ర, ఉపాధ్యాయ అభ్యర్థులు ఓటింగ్ పోలరె ౖజేషన్ వైపు దృష్టి సారించారు. పిడిఎఫ్ మినహా అధికార పార్టీ మద్దతుదారుల నుంచి మిగిలిన ప్రత్యర్థుల వరకు ఎవరి స్థాయిలో వారు ప్రలోభాలకు తెర లేపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి అధికార మద్ద తుదారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల వరకు ప్రలోభాలకు పాల్పడడం చర్చ నీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నిక వ్యవహారం రాష్ట్ర స్థాయిని ఆకర్షించింది. ఇటువంటి పరిస్థితుల్లోనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రచార దశలోనే ప్రలోభాలకు తెరలేచింది. అధికార పార్టీ మద్దతు కలిగిన ఎమ్మె ల్సీ అభ్యర్థుల అనుచరులు టిఫిన్ బాక్సుల దగ్గర నుంచి నగదు పంపిణీ వరకు భారీగా ప్రలోభాలకు తెరలేపడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో 1,41, 400 ఉపాధ్యాయ 2.09,800 పట్టభద్ర ఓటర్లు ఉన్న సంగతి తెలిసిందే. జిల్లాలోని 82 వేల మంది పట్టభద్రులు, సుమారు ఏడు వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో అత్యధికులకు నగదు పంపిణీ చేసి ప్రలోభాలకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. అత్యధికంగా ఉపాధ్యాయ ఓటరుకు రూ.ఐదు వేలు, పట్టభద్ర ఓటరుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. జిల్లా పరిధిలో గత 10 రోజులుగా బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని నగదు పంపిణీ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిందనే వార్తలు వెల్లువెత్తుతుండడం గమనార్హం. శనివారం సాయంత్రంతో ప్రచారఘట్టం ముగిసిన అనంతరం పోలింగ్ సమయానికి 48 గంటలను ఓటింగ్ పోలరైజేషన్ పేరుతో ప్రలోభాల పర్వం జోరందుకునే అవకాశం ఉంది. అధికార పార్టీ పరోక్ష మద్దతు పొందిన ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఏజెంట్ల నియామకం దగ్గర నుంచి పోలింగ్, కౌంటింగ్ దశల వరకు వెసులుబాటు ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ఏదేమైనా విద్యావంతులైన ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఓటింగ్‌లో వివేకాన్ని, విజ్ఞతను ప్రదర్శించే అవకాశం ఉందనే విశ్లేషకుల అంచనాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.










