అవార్డు అందుకుంటున్న సగీర్
రాయచోటి టౌన్ : సేవరత్న నేషనల్ అవార్డు - 2023 సంవత్సరానికి గానూ రాయచోటి పట్టణానికి చెందిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి షేక్. సగీర్ జాతీయ సేవారత్న అవార్డును అందుకున్నారు. ఆదివారం తిరుపతిలో నిర్వహించిన సౌతిండియా బహుజన రైటర్స్ 6వ నేషనల్ కాన్సరెన్స్‌లో బహుజన సాహిత్య అకాడమి జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యు. సుబ్రమనియన్ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. సౌతిండియాలోని 6 రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదిచ్చేరి రాష్ట్రాల నుంచి సుమారుగా 600 మంది డెలిగేట్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని సగీర్ పేర్కొన్నారు.










