Dec 20,2022 22:35

ధర్మవరం శ్రీనివాస డిగ్రీ కళాశాల జట్టు

ధర్మవరం టౌన్‌ : శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అంతర్‌ కళాశాల క్రికెట్‌ టోర్నీలో ధర్మవరం శ్రీనివాస డిగ్రీ కళాశాల జట్టు ప్రతిభ కనబరచి సెమీస్‌కు చేరింది. మంగళవారం పీవీకేకే, ధర్మవరం శ్రీనివాస డిగ్రీకళాశాలల జట్లు తలపడగా 60 పరుగుల తేడాతో ధర్మవరం శ్రీనివాస డిగ్రీకళాశాల జట్టు విజయం సాధించింది. జట్టులో అమరేష్‌ 65, నవీన్‌ 55, బార్గవ్‌ 49 పరుగులు సాదించి జట్టు విజయానికి కారకులయ్యారని కళాశాల ప్రిన్సిపల్‌ ముసలిరెడ్డి తెలిపారు. సెమీస్‌లో శ్రీనివాస డిగ్రీకళాశాల. ఎన్‌ఎస్‌ ఎన్‌ డిగ్రీ కళాశాల జట్లు తలపడనున్నట్టు ఆయన తెలిపారు.