సెమీ ఫైనల్‌కు చేరిన సత్యసాయి జిల్లా జట్టు
ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : నంద్యాలలో జరుగుతున్న 13వ రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర హాకీ పోటీలలో సత్యసాయి జిల్లా జట్టు సెమీఫైనల్‌కు చేరినట్టు కోచ్ హస్సేన్ తెలిపారు సోమవారం ఉదయం జరిగిన లీగ్ మ్యాచ్లో ఏలూరు జట్టుపై 4-1 గోల్స్ తేడాతో సత్యసాయి జిల్లా జట్టు గెలిచింది. సెమీఫైనల్లో సత్యసాయి జిల్లా జట్టు, అనకాపల్లి జట్లు తలపడనున్నట్టు కోచ్ తెలిపారు. దీంతో హాకీ అంధ్రప్రదేశ్ వైస్ ప్రసిడెంట్ బంధనాథం సూర్యప్రకాశ్, సత్యసాయి జిల్లా అధ్యక్షులు బీవీ శ్రీనివాసులు, ధర్మాంబ హాకీ అసోషియేషన్ ప్రతినిధులు బండివేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్, అంజన్న, గౌరిప్రసాద్ తదితరులు జట్టు సభ్యులను అభినందించారు.










