Dec 11,2022 10:41

కళాశాల ముందు ఆందోళన చేస్తున్నెస్‌ఎఫ్‌ఐ నాయకులు

          హిందూపురం : సెలవు రోజుల్లో సైతం తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసికంగా వేధిస్తున్న నారాయణ కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. రెండవ శనివారం అయినప్పటికీ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న ఎస్‌ఎప్‌ఐ నాయకులు కళాశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను నారాయణ విద్యాసంస్థల లెక్కజేయడం లేదన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ సెలవు రోజుల్లో కూడా సెలవు ఇవ్వకుండా విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ నాయకులు నిహాల్‌, ఇనాయత్‌ తదితరులు పాల్గొన్నారు.