రాయచోటి : పాఠశాలలకు సెలవులు నిన్నటితో ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమ వుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2236 ప్రభుత్వ పాఠశాలలు ,574 ప్రయివేట్ పాఠశాలలో మెత్తం విద్యార్థులు 2,55,094 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలుకు తున్నాయి. మొదటి విడుతలో నాడు - నేడు పనులు 963, రెండవ విడతలో 766 మంజూరయ్యాయి. వాస్తవానికి రెండవ విడత నాడు-నేడు పనులు ప్రారంభమై జులై నాటికి పూర్తి కావాల్సి ఉంది. కొన్ని పాఠశాలలో శిథిలావస్థకు చేరుకున్నాయి. మండలంలోని గరుగుపల్లిలో ప్రభుత్వ పాఠశాల్లో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. గాలివీడు మండలంలోని చీమల చెరువుపలి లో రెండువ విడత లో నాడు నేడు పనులు మంజూరుకావడంతో ఉన్న పాఠశాలను పడగొట్టారు. దీంతో విద్యార్థులను అంగన్వాడీ కేంద్రంలో వెళ్తున్నారు. అక్కడ స్థలం సరిపోక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నాడు నేడు నిర్మాణ పనులు కూడా నత్తనాడకన సాగుతున్నాయి. జిల్లాలో జిల్లా వ్యాప్తంగా విద్యా కానుక కిట్లుగా ఇచ్చే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, బ్యాగులు, బూట్లు 80 శాతం వరకు చేరాయి. ఏ పాఠశాలలోనూ పూర్తిస్థాయిలో కిట్లు పంపిణీ ప్రక్రియ జరగలేదు. ఒక ప్రక్క రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నాడు - నేడు పనుల ద్వారా మౌలిక పరిస్థితులను ఏర్పాటు చేస్తున్నామని ప్రచార ఆర్భాటాలు చేస్తూ ఉంది.
తగ్గని ఎండలు : అన్నమయ్య జిల్లాలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. గతంలో జూన్ మొదటి వారంలోని వాతావరణ మార్పులు వల్ల ఉష్ణోగ్రత తగ్గేది. ఏడాది జూన్ 12వ తేదీ అయినా కూడా 38 నుండి 41 శాతం వరకు ఉష్ణోగ్రత ఉంది . ఎండలు తీవ్రత కారణంగా నేటి నుండి 17 తేదీ వరకు ఉదయం 7:30 గంటల నుండి 11:30 గంటల వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు.
పాఠశాలల్లో వసతులు పూర్తి చేశాం
జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయి. అన్ని పాఠ శాలల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేశాం. ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించేందుకు చర్యలు తీసు కుంటాం. విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.
- శ్రీరామ్ పురుషోత్తం, జిల్లా విద్యాశాఖ అధికారి, అన్నమయ్య జిల్లా.










