May 23,2021 13:54

కోవిడ్‌ వల్ల దేశంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇలాంటి తరుణంలో అనేక మంది సెలబ్రిటీలు ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల బాలీవుడ్‌లో ఓ యువ హీరో అనాథ పిల్లల బాధ్యతను కూడా తీసుకున్నాడు. తాజాగా మరో బాలీవుడ్‌ నటి ఈ సమయంలో ప్రజల్లో ధైర్యాన్ని నింపడానికి ఓ సంస్థను స్థాపించింది. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు.. ఇటీవల ప్రభాస్‌ సరసన సహో చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌. పూర్తిపేరు : జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌
ముద్దుపేరు : జాకీ
పుట్టినతేదీ : 1985, ఆగస్టు 11
పుట్టిన ప్రాంతం : మనామా, బెహ్రెయిన్‌
దేశం : శ్రీలంక
నివాస ప్రాంతం : కొలొంబో, శ్రీలంక
చదువు : గ్రాడ్యుయేషన్‌ ఇన్‌ మాస్‌ కమ్యూనికేషన్‌
తల్లిదండ్రులు : ఎల్‌రారు ఫెర్నాండేజ్‌, కిమ్‌
ఇష్టమైన నటులు : షారూక్‌ఖాన్‌, లియోనార్డో డికాప్రియో, ఏంజలీనా జోలి

టి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ... గురించి బాలీవుడ్‌ పరిచయమున్న ప్రేక్షకులకు తెలిసిందే. తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న జాక్వెలిన్‌.. సోషల్‌ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. సామాజిక సేవలు పైనా బాగా ఆసక్తి చూపుతుంది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి దానిని దష్టిలో పెట్టుకుని.. ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఇటీవలే తను 'యేలో' (యూ ఓన్లీ లివ్‌ వన్స్‌) ఫౌండేషన్‌ ప్రారంభించి దీని ద్వారా ఆపన్నుల కోసం పాటుపడుతోంది. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసింది. ప్రజల్లో ధైర్యాన్ని నింపడానికి చేస్తున్న ఆమె కషిని చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సంస్థ ద్వారా ఇతరులకు తన వంతు సహాయం చేయడం ఎంతో గర్వంగా ఉందని చెబుతోంది జాక్వెలిన్‌. ఆకలి కడుపునిండినప్పుడే అసలైన శాంతి నెలకొంటుందని మదర్‌ థెరిసా అన్నారని గుర్తు చేసింది. ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ శివ నందన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'రోటి బ్యాంకు'ను ఆమె ఇటీవల సందర్శించింది. ఆ సందర్భంగా పేదలకు భోజనం వడ్డించింది. ఈ రోటీ బ్యాంకును చూసి తాను ఎంతో స్ఫూర్తి పొందానని తెలిపింది. ఈ సమయంలో ఈ సంస్థ ఎంతో మంది కడుపు నింపుతుందని తెలిపింది.

సేవ సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తోంది


 

                                                    100 పడకల ఆస్పత్రి కోసం ప్రయత్నం

   జాక్వెలిన్‌ ప్రస్తుతం ముంబయిలోని ఘట్కోపర్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో సేవలు కొనసాగిస్తోంది. భవిష్యత్తులో పౌండేషన్‌ ద్వారా ఏం చేస్తుందో తెలియజేసింది. 'మేం 100 పడకల ఆస్పత్రితో పాటు 500 పైగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌లను సమకూర్చుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు మా దగ్గర రెండు అంబులెన్స్‌లు ఉన్నాయి. ఇంకా ఏమేమీ చేయగలమో దానికోసం కషి చేస్తున్నాం. కొవిడ్‌ సమయంలో చాలామంది అంబులెన్స్‌ ఖర్చులు భరించలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది నిజంగా చాలా బాధాకరం. అందుకే మేం ఉచిత అంబులెన్స్‌ సేవలను ప్రారంభించాం. ఇందులో అవసరమైన మందులు, ఇతర పరికరాలు అందుబాటులో ఉంచాం.' అని తెలిపింది. ఈ విపత్కర కాలంలో రోటీ బ్యాంక్‌ ఫౌండేషన్‌తో కలిసి నిరుపేదలకు ఆహారం అందజేసింది. ఫౌండేషన్‌తో కలిసి లక్ష మందికి ఆహారం అందజేయడం ఇంకా మాస్కులు, పోలీసులకు శానిటైజర్లతో పాటు రెయిన్‌ కోట్లను విరాళంగా ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. జాక్విలెన్‌ ఇటీవల విడుదలైన 'రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయి' చిత్రంలో 'దిల్‌ దే దియా' అంటూ సాగే ప్రత్యేక గీతంలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె 'భూత్‌ పోలీస్‌', 'అటాక్‌', 'సర్కస్‌'తో పాటు అక్షరు కుమార్‌తో కలిసి 'బచ్చన్‌ పాండే', 'రామ్‌ సేతు' వంటి హిందీ చిత్రాల్లో నటిస్తోంది.