ప్రజాశక్తి-విజయవాడ అర్బన్: స్వచ్చమైన ప్రేమ కథతో రూపొందించిన 'సదా నన్ను నడిపే'' చిత్రాన్నీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చిత్ర కధా నాయకుడు ప్రతీక్ ప్రేమ్ కరణ్ తెలిపారు. సినిమా విజయయాత్రలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం చిత్ర కధానాయకుడు ప్రతీక ప్రేమ్ కరణ్ గాంధీనగర్‌లోని శైలజా థియేటర్‌కు విచ్చేసారు. సినిమా చూస్తున్న ప్రేక్షకులతో కాసేపు ముచ్చటించారు. సినిమా ఎలా ఉందొ అడిగి తెలుసుకున్నారు. అభిమానులు పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతీక ప్రేమ్ కరణ్ మాట్లాడుతూ తన తొలి చిత్రం వానవిల్లు అని, తొమ్మిదేళ్ల తరువాత మళ్ళి తెరకెక్కించిన చిత్రం సదా నన్ను నడిపే అని పేర్కొన్నారు. చిత్రానికి మంచి స్పందన లభించిందని, ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తున్నారని తెలిపారు. విజయయాత్రలో భాగంగా విజయవాడ రావడం ఆనందంగా ఉందన్నారు. తన ప్రతి చిత్రంలో కొంత షూటింగ్ విజయవాడలో చేస్తానని అన్నారు. ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్‌లు, ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు.తదనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు.










