Oct 09,2023 13:10

ప్రజాశక్తి-టి.నరసాపురం : గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి సోమవారం మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం గండిగూడెం గ్రామానికి చెందిన బోడా సుధీర్ (34) టి. నరసాపురంలో సచివాలయం-1లో డిజిటల్ అసిస్టెంట్ గా ఉద్యొగ బాద్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని మక్కినవారిగూడెంలో ఉదయం జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు కొద్దిగా కళ్ళు తిరిగినట్లు ఉండడంతో చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో మృతి చెందినట్లు స్తానికులు చెబుతున్నారు.