Sep 27,2023 18:51

రికార్డులను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌

ప్రజాశక్తి - లింగసముద్రం : లింగసముద్రంలోని ఒకటో సచివాలయంలో కందుకూరు సబ్‌కలెక్టర్‌ శోభిక బుధవారం తనిఖీ చేశారు. సచివాలయానికి వచ్చిన ఆమె రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. సకాలంలో విధులకు హజరకావాలని, అందరూ యూనిఫాం ధరించాలన్నారు. డిజిటల్‌ అసిస్టెంట్‌ సేవలను పెంచాలని చెప్పారు. సచివాలయంలో పనిచేసే సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. వివిధ పనులు కోసం వచ్చే వారి సనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వివరించారు.తహశీల్దార్‌ మీరావళి,ఎంపిడిఒ శేషుబాబు,రీ సర్వే డిటి ప్రసాద్‌ పాల్గొన్నారు.