ఫొటో : మాట్లాడుతున్న ఎంపిపి తాళ్లూరి వెంకటప్రసాద్‌నాయుడు
సచివాలయంలో ఎంపిపి తనిఖీ
ప్రజాశక్తి-దగదర్తి : మండలంలోని చెన్నూరు సచివాలయాన్ని ఎంపిపి తాళ్లూరి వెంకట ప్రసాద్‌నాయుడు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. సచివాలయం సిబ్బందిని అనంతరం సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయా లేవా అని సచివాలయం సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్క నిరుపేదలకు సంక్షేమ పదాలలో అందాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను తీసుకొచ్చారని వారు తెలిపారు. ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకుండా ఉంటే సంక్షేమ పథకాలు అందే విధంగా చూసుకోవలసిన బాధ్యత సచివాలయం సిబ్బంది వాలంటీర్లపై ఉందన్నారు. సచివాలయం సిబ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.










