ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ సి.శ్రీనివాసులు
సచివాలయలో ఎంపిడిఒ తనిఖీలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు మంగళవారం మండలంలోని నువ్వురూపాడు సచివాలయంలో ఎంపిడిఒ సి.శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అందరూ సచివాలయం సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ పద్ధతిలో హాజరు వేయాలని, ఏ ఒక్కరికీ మినహాయింపు లేదన్నారు. అలాగే ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి వచ్చిన అర్జీలను రిజిష్టర్‌లో నమోదు చేసి సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మి ప్రసన్న, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.










