సచివాలయంలో ఎంపిడిఒ తనిఖీ
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : మండలంలోని అన్ని సచివాలయాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సి.శ్రీనివాసులు తెలియజేశారు. మంగళవారం ఆయన బట్టేపాడు సచివాలయంలో తనిఖీ చేసి సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయం సిబ్బందితో ఆయన మాట్లాడుతూ సిబ్బంది తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చిన యూనిఫారం ధరించి విధులకు హాజరు కావాలని, అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వ పథకాలను అందించాలని కోరారు. ప్రస్తుతం జగనన్నకు చెబుదాం రా.. కార్యక్రమం అమలులో ఉందని కావున పంచాయతీ కార్యదర్శులు అప్రమతంగా ఉండి సంబంధిత సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తదుపరి గడపగడపకు మన ప్రభుత్వం కేంద్ర రూ.20 లక్షలు మంజూరు కాగా అందులో బట్టేపాడులో 14 లక్ష్యాలతో నిర్మించిన పనులను ఎంపిడిఒ పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరసింహులు, పద్మజ, సంక్షేమ సహాయకులు నవీన, ఇంజినీరింగ్ సహాయకులు ఖాజా మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.










