సచివాలయంలో ఎంపిడిఒ సందర్శన
ప్రజాశక్తి-ఉదయగిరి : మండలంలోని తిరుమలాపురం సచివాలయంలో ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్, ఇఒపిఆర్‌డి మల్లికార్జున గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎస్‌డిజి సర్వే సిఆర్‌ఆర్ యాప్ పురోగతిని సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయుష్మాన్‌భవ సర్వే గురించి అడిగి తెలుసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ముఖ్యంగా పన్ను 100 శాతం పూర్తి చేసి పంచాయతీలో కరెంటు చార్జెస్ పూర్తిగా సిఎఫ్ ఎంఎస్‌లో బిల్లు జానరేట్ చేసి చెల్లింపులు చేయాలన్నారు. జెఎస్‌ఎస్ విధానాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎస్‌డబ్ల్యుపిసి షెడ్‌లతో వర్మీ కంపోస్ట్ తయారు చేసి పంచాయతీ కి ఆదాయం సమకూర్చాలని పంచాయతీని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని కార్యదర్శికి ఆదేశించి పలు సూచనలు చేశారు. అనంతరం సచివాలయ రికార్డులు అప్డేట్ ఎప్పటికప్పుడు చేయాలని సూచించి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










