ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ ఐజాక్ ప్రవీణ్
సచివాలయాల్లో తనిఖీలు
ప్రజాశక్తి-సీతారామపురం : మండలంలోని అయ్యవారిపల్లి, బసినేనిపల్లి సచివాలయాలను బుధవారం ఎంపిడిఒ ఐజాక్ ప్రవీణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు, మూవ్‌మెంట్ రిజిస్టర్, సిబ్బంది విధి నిర్వహణ రిజిస్టర్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్క సచివాలయ సిబ్బంది సచివాలయంలో పనివేళలలో అందుబాటులో ఉండాలని, బయోమెట్రిక్ అటెండెన్స్ ఖచ్చితంగా వేయాలని, సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు అందరూ అందుబాటులో ఉండి స్పందన కార్యక్రమం నిర్వహించాలని, సచివాలయంలో సేవలను పెంచాలని ఆయుష్మాన్ భారత్ సర్వే పూర్తి చేయాలనీ తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, తదితరులు పాల్గొన్నారు.










