ఫొటో : రికార్డులు పరిశీలిస్తున్న తహశీల్దారు హేమంత్‌కుమార్
సచివాలయాల్లో తహశీల్దారు తనిఖీలు
ప్రజాశక్తి-బిట్రగుంట : బోగోలు మండలం జువ్వలదిన్నె, ఎస్‌పిపాలెం సచివాలయాల్లో శనివారం తహశీల్దార్ హేమంత్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హునికి చేరేలా చూడాలని సిబ్బందికి సూచనలు చేశామని, విధుల్లో అలసత్వం వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జగనన్న కాలనీలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులున్నారు.










