Jan 24,2023 21:58

ఫొటో : సిబ్బందితో మాట్లాడుతున్న డిఎల్‌డిఒ పద్మజ

సచివాలయాల్లో రికార్డులు పరిశీలన
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలోని గ్రామ సచివాలయంలో అందించే సేవలను మరింత పెంచి ప్రభుత్వ ఆశయాలను కాపాడాలని కందుకూరు డిఎల్‌డిఒ పద్మజ అన్నారు. మంగళవారం మండలంలోని తిమ్మారెడ్డిపల్లి, రామాపురం, వరికుంటపాడు, తూర్పు బోయమడుగుల, సచివాలయాలను డిఎల్‌డిఒ పద్మజ తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. అనంతరం ఎంపిడిఒ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు ఎఎన్‌ఎంలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయుష్మాన్‌ భారత్‌లో నమోదు చేయడంలో మండలం చాలా వెనుకబడి ఉందని అలాగే రైతు భరోసా టెస్ట్‌ నమోదు చేయడం ఇంకా ప్రారంభం కాలేదని అలాగే విద్యార్థులకు అందించే కుల ధృవీకరణ పత్రాల జారీ సైతం ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి వెంటనే సంబంధిత సచివాలయ అధికారులతో వాలంటీర్ల ద్వారా పనులు ప్రారంభించాలన్నారు. అలాగే సచివాలయాల్లో అందించే సేవలను మరింత పెంచాలని తెలిపారు. కరెంట్‌ బిల్లులు సైతం సచివాలయంలోనే కట్టే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ విజయభాస్కరరావు, ఇఒపిఆర్‌డి సురేష్‌ బాబు, ఎంపిడిఒ కార్యాలయ జూనియర్‌ సహాయకులు రామకృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు హరి శ్రీనివాసులు, విష్ణువర్ధన్‌రెడ్డి, ఖాజామొహిద్దీన్‌, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.