ప్రజాశక్తి-కంచికచర్ల
గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ అజరు కుమార్ నుపూర్ ఆదేశించారు. మంగళవారం కంచికచర్ల, పరిటాల లలో గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది పనితీరును సమయపాలన వహిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. సచివాలయ సిబ్బందికి సంబంధించి బయోమెట్రిక్ రిజిస్టర్ పరిశీలించారు. నోటీస్ బోర్డ్‌లో పెట్టిన సేవలను ఎంత మాత్రం పూర్తి చేశారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు..ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వి రాజకుమారి, గ్రామ పంచాయతీ కార్యదర్శి కనగాల రవికుమార్, ఆర్ ఐ శిరీష సిబ్బంది పాల్గొన్నారు.










