ఫొటో : మాట్లాడుతున్న కావలి లోక్ అదాలత్ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఎం.శోభ
సబ్‌జైల్లో న్యాయ విజ్ఞాన సదస్సు
ప్రజాశక్తి-కావలి : స్థానిక సబ్ జైల్లో మంగళవారం మండల న్యాయ సేవాధికార సంస్థ (లోక్ అదాలత్) ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సకు ముఖ్యఅతిథిగా కావలి లోక్ అదాలత్ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఎం.శోభ ముఖ్య అతిథిగా హాజరై, అక్కడ ఉన్న ఖైదీలకు కొన్ని చట్టాలను వివరించారు. అలాగే సమాజంలో చెడు ప్రభావాలను విడిచి మంచిగా మెలగాలని తెలిపారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ మెంబర్, న్యాయవాది ఐ.సాయి ప్రసాద్, న్యాయ వాది నరసింహా రావు, జైలు సూపరిం టెండెంట్ చిన సుబ్బయ్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.










