సబ్ కలెక్టర్‌ను సన్మానిస్తున్న ఎమ్మెల్యే మేడా
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జునరెడ్డి బుధవారం సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. నియోజకవర్గంలోని పలు రకాల సమస్యలపైన సబ్ కలెక్టర్‌తో చర్చించానని మేడా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు యోగేశ్వర్‌రెడ్డి, ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ చిదానంద గౌడ్, ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ హస్తవరం ఉమామహేశ్వర్‌రెడ్డి, మందరం గంగిరెడ్డి, విశ్వనాథరాజు పాల్గొన్నారు.










