ప్రతిభా క్రీడాకారులతో పాఠశాల ప్రతినిధులు
ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : చెన్నైలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సౌత్ జోన్ వాలీబాల్ టోర్నమెంట్‌కు మంగళకర విద్యార్థులు ఎంపికైనట్లు వ విద్యాసంస్థల ఎఒ జయచంద్ర రెడ్డి తెలిపారు. మండలంలోని జగరాజు పల్లి మంగళకర విద్యాసంస్థలో బిబిఎ తృతీయ సంవత్సరం చదువుతున్న హరీష్ నాయక్, డి జశ్వంత్ యాదవ్ సౌత్‌జోన్ వాలీబాల్ టోర్నమెంట్‌కు ఎంపికయ్యారు. ఈనెల 23 నుండి 27 వరకు జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఎస్కే యూనివర్సిటీ జట్టుకు వీరు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను కరస్పాండెంట్ సురేష్ కుమార్, ప్రిన్సిపల్ రమేష్ బాబు, పీడీ శ్రీనివాసులు, అధ్యాపకులు అభినందించారు.










