Mar 09,2023 22:10

చెస్‌ పోటీలకు ఎంపికైన విద్యార్థితో అధ్యాపకులు

ధర్మవరం టౌన్‌ : సౌత్‌ జోన్‌ చెస్‌ పోటీలకు స్థానిక కెహెచ్‌ ప్రభుత్వ డిగ్రీకళాశాలకు చెందిన వంశీకృష్ణ అనే విద్యార్థి ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపల్‌ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. ఎస్కే యూనివర్సిటీ నిర్వహించిన సెలక్షన్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన వంశీకృష్ణ ఎస్కేయూ జట్టుకు ఎంపికయ్యారన్నారు. ఈ విద్యార్థి చెన్నైలోని ఎస్పీఎం యూనివర్సిటిలో ఈనెల 10 నుండి ప్రారంభమయ్యే సౌత్‌జోన్‌ పోటీల్లో ఎస్కేయూ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి వంశీకృష్ణను కళాశాల ప్రిన్సిపల్‌తో పాటు వైస్‌ ప్రిన్సిపల్‌ జీవన్‌కుమార్‌, పీడీ ఆనంద్‌, అధ్యాపకులు చిట్టెమ్మ, షమీవుల్లా, కిరన్‌కుమార్‌, గోపాల్‌నాయక్‌, పావని, భువనేశ్వరి, పుష్పవతి, గౌతమి అభినందించారు.