Feb 18,2023 20:29

శైవ క్షేత్రాలు కిటకిట

 శుక్రవారం రాత్రికే శైవక్షేత్రాలన్నీ భక్తులతో నిండిపోవడంతో శనివారం ఉదయం స్వామిని దర్శించుకున్న భక్తుల్లో పలురువు తిరిగి తమ ప్రాంతాలకు చేరుకున్నారు. స్థానికంగా ఉన్న శివాలయాలకు వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. మరికొందరు అటవీ ప్రాంతాల్లోని శివాలయాలలో జాగరణ చేస్తే మరింత పుణ్యం అభిస్తుందని భావించి అక్కడే ఉండిపోయారు. ఇంకొందరు శనివారం మధ్యాహ్నం బయలుదేరి అటవీ ప్రాంతాల శైవక్షేత్రాలకు వెళ్లారు.
కలకడ : వాడవాడలా మహాశివరాత్రి సంబరాలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని కామాక్షి సమేత సిద్దేశ్వర స్వామి ఆలయం లో ఉదయం నుండి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో ఆలయ ధర్మకర్త అఖిలేష్‌, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వివాహాన్ని కనులారా తిలకించారు. బి.కొత్తకోట : మండలంలోని బీరంగి పంచాయతీ, శంకరాపురం వద్ద గుగూట్ట కోనలో వెలసిన బండెన్న స్వామి ఆలయం సందర్శకులతో కిటకిటలాడింది. శనివారం ఉదయం నుంచే జిల్లా పరిధిలో నుంచే కాకుండా, కర్ణాటక నుండి భక్తులు ఆధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 131 దేవతామూర్తుల విగ్రహాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ పీఠాధిపతి పగడాల లక్ష్మీపతి స్వామి మాట్లాడుతూ ప్రతి ఏడాది మహాశివరాత్రి వేడుకలను ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుకునే సంగతి భక్తులకు తెలిసిందేనన్నారు. ఈ ఏడాది మరింత బ్రహ్మాండంగా మహా శివరాత్రి వేడుకలు నిర్వహించామని అన్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలతోపాటు సులభంగా స్వామివారి దర్శన కల్పించామని తెలిపారు. అభిషేకాలు,విశేష పూజలు నిర్వహించడం జరిగిందన్నారు.ప్రతి సోమ, శుక్రవారాలలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కోసం ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజంపేట అర్బన్‌ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. దక్షిణ కాశీగా పేరొందిన అత్తిరాళ్ల పుణ్యక్షేత్రంలో శనివారం తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శివయ్యకు అర్చకులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తుల దర్శనానికి అనుమతిని ఇచ్చారు. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్‌ వెలగచర్ల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అధికారుల సమన్వయంతో భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించారు. భక్తులకు త్రాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు వంటి వసతులను ఏర్పాటు చేశారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవ వేడుకలను పర్యవేక్షిస్తున్నారు. బాహుదానదిలోకి వెళ్లి భక్తులు ప్రాణాపాయానికి గురికాకుండా పటిష్టమైన బారికేడ్లను, పోలీసు సిబ్బందిని నియమించారు. డిఎస్‌పి శివ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇద్దరు సిఐలు, పదిమంది ఎస్‌ఐలు, 140 మంది పోలీసు బలగాలతో పాటు ఎన్‌సిసి క్యాడేట్లను నియమించి పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. టిడిపి నాయకులు చమర్తి జగన్మోహన్‌ రాజు అత్తిరాళ్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అయన వెంట పోలి శివకుమార్‌, రాము యాదవ్‌, హరినాథ్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు జీవీ.సుబ్బరాజులు పాల్గొన్నారు. గాలివీడు : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మండలంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు కుటుంబ సమేతంగా వెళ్లి శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అర్పణలు చేశారు. రామలింగేశ్వర ఆలయం, ప్రత్యేక గండి మడుగు ఉమామహేశ్వరాలయం, తూముకుంటలో పెద్ద గొడుగు నోముల బ్రహ్మేంద్రస్వామి దేవాలయాల వద్ద ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. వీరబల్లి : మండల వ్యాప్తంగా ప్రాంతాల్లోని శైవక్షేత్రాల్లో డి.రాచపల్లి పంచాయతీ మల్లేశ్వర స్వామి పూజారి శంకరయ్య చారి ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆయా ఆలయాల వద్ద భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పలు సేవా సంఘాలు ఆలయాల వద్ద పాలు, అల్పాహారం, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. నిమ్మనపల్లి : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తవళం గ్రామంలోని శ్రీ యోగ నేలమల్లేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు గోపాలకష్ణ, మండల వైసిపి ఇన్‌ఛార్జ్‌ ఆర్‌.ఐ రమణారెడ్డి, ఇఒ మంజుల ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించారు. శనివారం ఉదయం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలను నిర్వహించారు. స్వామివారిని మదనపల్లి ఆర్‌డిఒ ఎంఎస్‌.మురళి, తహశీల్దార్‌ సిఆర్‌.మంజుల, ఎంపిడిఒ లీలా మాధవి, నాయకులు రాటకొండ బాబురెడ్డి, పలువురు నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మదనపల్లె అర్బన్‌: మదనపల్లి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని మండలాల్లో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివ నామస్మరణతో శివాలయాలు మారు మ్రోగాయి. శనివారం శివరాత్రి పండుగ సందర్భంగా ఉదయం నుండే పెద్ద ఎత్తున భక్తులు శివాలయాలకు చేరుకొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, మొక్కలు చెల్లించుకున్నారు. భక్తుల తాకటిని దష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీలు, అధికారులు ప్రత్యేకంగా బార్కెడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక పండుగ వాతావరణంలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. శివాలయాల వద్ద భక్తులు రద్దీని దష్టిలో ఉంచుకొని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. పుల్లంపేట : మండల పరిధిలోని పుల్లంపేట, అనంతంపల్లి, మొదలగు పంచాయతీలలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతం పల్లె వద్ద కలిసి ఉన్న శివునికి వేద పండితులతో ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకి తీర్థప్రసాదాలు అందించారు. పూజా కార్యక్రమం అనంతరం గుడ్ల సుబ్బారెడ్డి అన్న ప్రసాదం చేశారు. కార్యక్రమంలో ఆలయ పూజారి శివ శర్మ, నారపు రెడ్డి శ్రీనివాసులరెడ్డి, చంద్రమోహన్‌ రెడ్డి, పల్లపు జనార్ధన్‌, యద్దల మోహన్‌ మూర్తి, దేసూరి లక్ష్మీనారాయణ రెడ్డి, రెడ్డి రాజు, పోలి చంగల్‌ రెడ్డి, సిఐటియు మండల అధ్యక్షురాలు వనజ కుమారి పాల్గొన్నారు. పెద్దమండ్యం : మండలంలోశివరాత్రి పర్వదిన మండలంలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. పెద్దమండ్యం లో శుశావతి నది తీరాన వెలచిన శ్రీ భవాని శంకర్‌ అలయములో, పాపేపల్లిలో శివాలయంలో, ముసలీకుంట, తాటిమకూలపల్లి, శివపురం నెలమల్లయ్య శివాలయాలలో శివలింగానికి వివిధ పుష్పలతో, అలంకరించి, పంచామతముతో, వేదమంత్రాలతో శనివారం అభిషేకం చేశారు. మల్లయ్య స్వామి వద్ద భక్తులు సహకారంతో ట్రస్ట్‌ ఆధ్వర్యంలోరెండు రోజులు అన్నదనాకార్యక్రము, తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నారా రామచంద్ర య్య, ఎంపిపి పూర్ణచంద్రిక రమేష్‌, సర్పంచ్‌ భాష, ఉపసర్పంచ్‌ గాజుల సుధాకర్‌, ఆలయ అర్చకులు మణికంఠ శర్మ, ప్రసాద్‌ స్వామి,పణి కుమార్‌ స్వామి,గోపి స్వామి,సాయి గుణస్వామి,పవన్‌ స్వామి,కష్ణమూర్తి స్వామి, భక్తులు పాల్గొన్నారు.బి.కొత్తకోట : భక్తులతో పీఠాధిపతి పగడాల లక్ష్మీపతిస్వామి