Jan 29,2023 21:58

ఫొటో : మాట్లాడుతున్న జెవివి నాయకులు

సైన్స్‌ కార్యక్రమాలపై అవగాహన
ప్రజాశక్తి-ఉదయగిరి : సైన్స్‌ మాసోత్సవం భవిష్యత్‌ కార్యక్రమాలపై అవగాహన సదస్సులను నిర్వహించాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా సెక్రటేరియట్‌ సమావేశం నిర్వహించారు. ఆదివారం స్థానిక యూనియన్‌ రోడ్‌ షాదీ మంజిల్‌లో జెవివి రాష్ట్ర ఉపాధ్యక్షులు, సీనియర్‌ నాయకులు ఎస్‌.కె.దస్తగిరి అహ్మద్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెవివి వ్యవస్థాపక సభ్యులు డాక్టర్‌ జి.సుధాకర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు కె.వి.శేషారెడ్డి అడ్వకేట్‌ పాల్గొని జెవివి సభ్యత్వం సైన్స్‌ మాసోత్సవం భవిష్యత్‌ కార్యక్రమాల గురించి చర్చించారు. అనంతరం గ్లోబలైజేషన్‌ ఆల్టర్నేటివ్‌ ఎనర్జీ, జీవ పరిణామక్రమం, అంతరిక్షం అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేశారు.
అన్ని మండల కమిటీలు సమావేశాలు నిర్వహించి సైన్స్‌ మాసంలో సైన్స్‌ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నియోజకవర్గంలో అన్ని ఉన్నత పాఠశాలలు జూనియర్‌ కాలేజీ, డిగ్రీ కాలేజీలలో విద్యార్థులకు సైన్సుపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో జెవివి నాయకులు డాక్టర్‌ ఎస్‌.కె.గౌస్‌ బాషా, 25 మంది జిల్లా సెక్రెటేరియట్‌ సభ్యులు పాల్గొన్నారు.