Jan 16,2023 17:47

సైనికులను సన్మానిస్తున్న ఎంపిపి మేడా

ప్రజాశక్తి-నందలూరు : దేశ భద్రత కోసం మన సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని ఎంపిపి మేడా విజయభాస్కర్‌రెడ్డి కొనియాడారు.ఆదివారం రాత్రి జాతీయ సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని అరవపల్లి పంచాయతీ కూడలి వద్ద అమ్మవారి శాల అధ్యక్షులు నరసింహస్వామి, జిల్లా వక్ఫ్‌్‌ బోర్డు మైనార్టీ కార్యదర్శి సయ్యద్‌ అమీర్‌, రాష్ట్ర యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి హిమగిరినాథ్‌ యాదవ్‌, మండల కో-ఆప్షన్‌ సభ్యులు కలీం వైసిపి మండల మైనార్టీ కన్వీనర్‌ మన్సూర్‌ అలీఖాన్‌ ఆధ్వర్యంలో విశ్రాంత, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సైనికులకు ఏర్పాటు చేసిన సన్మాన సభలో ముఖ్యఅతిథిగా ఎంపిపి, నాగిరెడ్డిపల్లి మేజర్‌ గ్రామ సర్పంచ్‌ జంబు సూర్యనారాయణ పాల్గొన్నారు. లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు కుర్రా మణి, టీచర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు అల్లం అశోక్‌ కుమార్‌ చేతుల మీదుగా సైనికులను పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ దేశాన్ని, దేశ పౌరులను కాపాడటానికి వారి జీవితాలను సైతం త్యాగం చేసిన సైనిక వీరులను, దేశ భద్రత కోసం వారు చేస్తున్న సేవలను స్మరించుకుంటూ సైనికులను అభినందించడానికి నందలూరు మండలం వేదిక కావడం గర్వించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మైనుద్దీన్‌, వైస్‌ ఎంపిపి తుమ్మల భావన శ్రీధర్‌, విజయుడు, తుమ్మల శ్రీధర్‌ గౌడ్‌, న్యాయవాది షేక్‌ మహమ్మద్‌ అలీ పాల్గొన్నారు.